అన్నమయ్య జిల్లా టీడీపీలో భగ్గుమన్న వర్గవిభేదాలు..ప్లెక్సీలు చించేశారు

అన్నమయ్య జిల్లా టీడీపీలో భగ్గుమన్న వర్గవిభేదాలు..ప్లెక్సీలు చించేశారు

అన్నమయ్య జిల్లా తెలుగు దేశం పార్టీ (టీడీపీ) లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని తంబళ్లపల్లెల్లో ఏపీ మంత్రి నారాలోకేష్ జన్మదినం సందర్భంగా ఓ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరో వర్గం చించేయడం కలకలం రేపుతోంది.  

తంబళ్లపల్లెలో మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల చించేయడంతో రచ్చ మొదలైంది. తంబలళ్ల పల్లె మండలం బీసీ సెల్ అధ్యక్షులు పురుషోత్తం బాబు టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఫొటోలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

 మరోవైపు తంబళ్లపల్లె  ఇంంఛార్జీ దాసరిపల్లి జయచంద్రారెడ్డి కూడా బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే జయచంద్రారెడ్డి ఫ్లెక్సీలు, బ్యానర్లు చించకుండా  పురుషోత్తం బాబు ఫ్లెక్సీలు బ్యానర్లు చించివేయకుండా వదిలివేయడంతో ఆ పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. 

చించేసిన బ్యానర్లలో రవాణా శాఖ మంత్రి, ఐటీ, విద్యాశాఖ మంత్రి బ్యానర్లు కూడా ఉన్నాయి.