బీఆర్ఎస్కు షాక్..జెడ్పీటీసీ సహా 30 మంది రాజీనామా

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో బీఆర్ఎస్ లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకే పార్టీలో ఉన్న రాజకీయ నేతల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇప్పటికే వర్గవిభేదాలతో లీడర్లంతా..బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. గార్ల బీఆర్ఎస్ జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ పార్టీకి రాజీనామా చేశారు. జెడ్పిటీసీతో పాటు 30 మంది వార్డు మెంబర్ లు, మండల స్థాయి కార్యకర్తలు రాజీనామా చేశారు.

ఎందుకు రాజీనామా...

తాను ఎందుకు బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నానన్న విషయాన్ని జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ వెల్లడించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యను సస్పెండ్ చేసినందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాము పొంగులేటి వర్గమని..వారి లేని పార్టీలో ఉండలేమని స్పష్టం చేశారు.