దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్వీ)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఎంపిక పరీక్ష-2025 దరఖాస్తుకు సెప్టెంబర్ 16 వరకు ఆన్లైన్లో అవకాశం కల్పించింది.
అర్హత: విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2024-–25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. విద్యార్థులు 1 మే 2013 నుంచి 31-జులై -2015 మధ్యలో జన్మించి ఉండాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఎగ్జామ్ మూడు విభాగాలు(మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.
అప్లికేషన్స్: ఆన్లైన్లో జేఎన్వీ అధికారిక వైబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ 2025 జనవరి 18న నిర్వహిస్తారు. మార్చిలో రిజల్ట్స్ ఇస్తారు. వివరాలకు www.navodaya.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.