- పోలీసులకు తల్లిదండ్రుల కంప్లయింట్
- జోగులాంబ జిల్లా అయిజ టౌన్ లో ఘటన
అయిజ, వెలుగు: స్టూడెంట్ ను క్లాస్ టీచర్ చితక బాదిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. ఘటనపై పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అయిజ టౌన్ కు చెందిన జ్యోతి, కృష్ణ నాయక్ దంపతుల కొడుకు విరాట్ స్థానిక కృష్ణవేణి స్కూల్ లో సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన విరాట్ టీచర్ కొట్టిందని తల్లికి చెప్పాడు. దీంతో ఆమె కొడుకు షర్టు విప్పి చూసింది. గురువారం ఉదయం స్కూల్ కు వెళ్లి తమ కొడుకును ఎందుకు కొట్టారని స్కూల్ కరస్పాండెంట్ ను అడిగారు. తనకు సంబంధం లేదని టీచర్ పై కేసు పెట్టుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.
స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి, క్లాస్ టీచర్ మానసపై చర్యలు తీసుకోవాలని స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్వీ జిల్లా కో – ఆర్డినేటర్ పల్లయ్య, ఏబీవీపీ విద్యార్థి నేతలు స్కూల్ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ఎంఈవో రాములు దయాల్ స్కూల్ కు వెళ్లి విచారణ చేశానరు. డీఈవో అబ్దుల్ గనికి నివేదిక అందజేస్తామని, ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కరస్పాండెంట్ ను వివరణ కోరగా..క్లాస్ లో అల్లరి చేస్తుంటే స్టూడెంట్ ను టీచర్ మందలించిందని తెలిపారు.