రాజగోపాల్ రెడ్డికి టికెట్.. చలమల రాజీనామా?

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డికి టిక్కెట్ కేటాయించడంతో చలమల కృష్ణారెడ్డి మనస్తాపం చెందారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో కృష్ణారెడ్డి వర్గీయులు రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈరోజు(అక్టోబర్ 28) మధ్యాహ్నం దామర క్యాంపు కార్యాలయంలో తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కృష్ణారెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. 

Also Read :- కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని పెట్రోల్ పోసుకున్నడు

ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. మునుగోడులో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని చలమల వర్గీయులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో చలమల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.