2025 నుంచి ట్రైబల్‌‌‌‌ యూనివర్సిటీలో క్లాస్‌‌‌‌లు

ములుగు, వెలుగు : ములుగులోని ట్రైబల్‌‌‌‌ యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాస్‌‌‌‌లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌‌‌‌ ఎ.శరత్‌‌‌‌ చెప్పారు. యూనివర్సిటీ కోసం ములుగులోని గట్టమ్మ వద్ద కేటాయించిన స్థలాన్ని బుధవారం హైదరాబాద్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్‌‌‌‌ అభిషేక్‌‌‌‌కుమార్‌‌‌‌, రిజిస్ట్రార్‌‌‌‌ దేవీశ్‌‌‌‌ నిగమ్‌‌‌‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థలానికి సంబంధించిన వివరాలను కలెక్టర్‌‌‌‌ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్‌‌‌‌ వివరించారు. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్​సెక్రటరీ శరత్‌‌‌‌ మాట్లాడుతూ యూనివర్సిటీకి కేటాయించిన 337 ఎకరాల భూమిని గిరిజన సంక్షేమ శాఖకు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేసినట్లు తెలిపారు.

ములుగు మండలంలోని జాకారంలో గల యూత్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో తాత్కాలిక తరగతులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రెడీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్‌‌‌‌రెడ్డి, ఆర్డీవో సత్యపాల్‌‌‌‌రెడ్డి, సీపీడబ్ల్యూడీ ఏఈ నవీన్, తహసీల్దార్‌‌‌‌ విజయభాస్కర్ పాల్గొన్నారు.