- తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం వైటీసీ ఎంపిక
- బిల్డింగ్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ములుగు, వెలుగు : ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఇటీవల బడ్జెట్‌లో రూ.900ల కోట్లు కేటాయించిన కేంద్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచే క్లాస్‌లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 337 ఎకరాల భూమిని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి చుట్టూ ట్రెంచ్ కొట్టించింది. అలాగే తాత్కాలికంగా తరగతుల నిర్వహణ కోసం ములుగు మండలం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను కేటాయించింది. దీంతో వైటీసీలో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
టెంపరరీ బిల్డింగ్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ములుగులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక తరగతుల కోసం ఎంపిక చేసిన వైటీసీ బిల్డింగ్‌ను ఉదయం 10 గంటలకు మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం తరగతుల నిర్వహణ, ప్రొఫెసర్లు, తాత్కాలిక సిబ్బంది, ఇతర వనరులపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫీసర్లతో రి