స్కూల్​ పాడైంది.. రైతువేదికే బడైంది!

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి గవర్నమెంట్ హైస్కూల్​లో 200 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. 40 ఏండ్ల కింద కట్టిన స్కూల్​ బిల్డింగ్ పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో క్లాస్​రూంల పైకప్పు నుంచి పెచ్చులు ఊడి పడుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళనతో టీచర్లు పలుమార్లు ఆఫీసర్లకు మొరపెట్టుకున్నారు. లోకల్​గా ఉండే ప్రజాప్రతినిధులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో ఆరు, ఏడో తరగతి చదివే స్టూడెంట్స్​ను టీచర్లు రైతువేదికకు తరలించి పాఠాలు చెబుతున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి తమ స్కూల్​కు కొత్త బిల్డింగ్​ కట్టించి ఇవ్వాలని స్టూడెంట్స్, టీచర్స్​తో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. 
- వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్