ములుగు, వెలుగు : ములుగు మెడికల్ కాలేజీలో త్వరలోనే తరగతులను ప్రారంభిస్తామని డీహెచ్ రవీందర్‌నాయక్ చెప్పారు. వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ శివరామకృష్ణతో కలిసి గురువారం ములుగు జిల్లా హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
ములుగులో మెడికల్ కాలేజీ నిర్వహణకు భవనం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ములుగులో ప్రస్తుతం 100 పడకల హాస్పిటల్ ఉందని, కొత్తగా నిర్మిస్తున్న 300ల పడకల హాస్పిటల్‌లో డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకంపై ప్లాన్‌లు సిద్ధం అవుతున్నాయన్నారు. అంతకుముందు మేడారంలో సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మేడారంలో కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు చిన్న ప్రమాదం నుంచి హార్ట్‌అటాక్ తదితర సేవలు సైతం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేడారంలో ఇప్పటికే 50 పడకల హాస్పిటల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. వారివెంట డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య, హాస్పిటల్ సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్ జగదీశ్వర్, పూజారి రఘు ఉన్నారు.