
నాగర్‌కర్నూల్/వనపర్తి, వెలుగు: కొత్తగా శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీల్లో మంగళవారం నుంచి క్లాసెస్ స్టార్ట్ కానున్నాయి. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో నిర్మించిన కాలేజీలో ఫస్ట్ ఇయర్ టీచింగ్‌కు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ జాయిన్అయ్యారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి వర్చువల్ మీటింగ్‌లో క్లాసులు స్టార్ట్ చేస్తారని మంత్రి నిరంజన్‌రెడ్డి, కాలేజీల ప్రిన్సిపాల్స్ సోమవారం మీడియాకు తెలిపారు. నాగర్‌కర్నూల్ మెడికల్కాలేజీలో స్టూడెంట్ల హాస్టల్స్ కోసం పుల్లారెడ్డి బీఎడ్కాలేజీ, ప్రగతి డిగ్రీ కాలేజీ బిల్డింగ్స్ తీసుకున్నారు.
నర్సరీలకు స్థలాలు గుర్తించాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వచ్చే ఏడాది హరితహారం కోసం మొక్కలు పెంచేందుకు నర్సరీలకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. ‘ప్రజావాణి’ లో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ మీటింగ్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల గ్రామ సభల కార్యక్రమాన్ని ఈ నెల 30లోగా పూర్తి చేయాలన్నారు. మిడ్జిల్, బాలానగర్, జడ్చర్ల, రాజాపూర్, నవాబ్ పేట మండలాల్లో ఇరిగేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు ఉపాధి కింద సంయుక్తంగా నీటి నిల్వ పనులు చేపట్టాలన్నారు. నర్సరీల యాక్షన్ ప్లాన్ ఇప్పటి నుంచే తయారు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, జడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీవో యాదయ్య, ఆర్డీవో అనిల్ కుమార్ పాల్గొన్నారు.
రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
ఉప్పునుంతల(వంగూర్)/ నాగర్‌కర్నూల్‌టౌన్, వెలుగు: పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందని నాగర్కర్నూల్ఎంపీ పి. రాములు అన్నారు. సోమవారం వంగూర్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో పీఏసీఎస్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతు వ్యతిరేక పాలన సాగిస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్మండల అధ్యక్షుడు పులిజాల కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు గణేశ్ రావు, వైస్ ఎంపీపీ సంధ్య తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనుల్లో గోల్మాల్ లెక్కలు..
ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించిన ఆడిట్ ఆఫీసర్లు
పెబ్బేరు, వెలుగు : మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో 2019 నవంబరు నుంచి 2022 మార్చి వరకు జరిగిన ఉపాధి పనుల్లో 2,841 పనులకు సంబంధించి రూ.72,875లకు లెక్కలు లేవని, రూ.36,916 మేర ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించామని సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది. సోమవారం పెబ్బేరులోని ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో 12వ విడత సామాజిక తనిఖీలో భాగంగా ఆడిట్నిర్వహించారు. అధికారులు గతనెల అక్టోబర్ నుంచి ఆడిట్ నిర్వహించడంతో పాటు వివిధ సమస్యలను గుర్తించారు. పలు గ్రామాల్లో రోడ్ల పక్కన నాటిన మొక్కలు లేకుండానే ఫండ్స్డ్రా చేశారని, నర్సరీలో మొక్కలు లేకుండానే ఫండ్స్శాంక్షన్ చేశారని, మస్టర్లు లేకుండానే కూలి చెల్లించినట్లు గుర్తించామన్నారు. జరిగిన ఫ్రాడ్‌పై వెంటనే వివరణ ఇవ్వాలని పెబ్బేరు ఎంపీడీవోను ఆదేశించారు. ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ పద్మ, డీఆర్డీవో నరసింహులు పాల్గొన్నారు.
తెలంగాణలో లైబ్రరీలకు మహర్దశ
మహబూబ్‌నగర్, వెలుగు : తెలంగాణ ఏర్పడ్డాకే లైబ్రరీలకు మహర్దశ వచ్చిందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ లైబ్రరీలో ఏర్పాటు చేసిన 55వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలకు మంత్రి హాజరై మాట్లాడారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్లకు లైబ్రరీలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఆన్‌లైన్‌ద్వారా కోచింగ్ అందించేందుకు స్థానిక సిబ్బంది హైదరాబాద్‌లోని చిక్కడపల్లి లైబ్రరీని విజిట్చేయాలని అక్కడి వసతులపై స్టడీ చేయాలని మంత్రి ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఆమనగల్లు/ అలంపూర్, వెలుగు: తలకొండపల్లి మండలంలోని పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు, నెలవారీగా ఫండ్స్ రిలీజ్చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ఎదుట సర్పంచ్‌లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో కార్మికులకు వేతనాలు, విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు, డీజిల్ బిల్లులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. కేంద్రం, రాష్ట్రం నుంచి రావాల్సిన బిల్లులు, నిధులు రాక ఇబ్బంది పడుతున్నామన్నారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్కలెక్టర్ ప్రతీక్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. సర్పంచ్‌లు గోపాల్ నాయక్, వెంకట్రాంరెడ్డి, రమేశ్‌యాదవ్, బండి రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
సర్పంచుల సమస్యలను పరిష్కరించండి
సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని గద్వాల జిల్లా సర్పంచుల సంఘం లీడర్లు డిమాండ్ చేశారు. ఉండవెల్లి మండలం పరిధిలోని అలంపూర్ మార్కెట్ యార్డులో సర్పంచుల సమస్యలపై సోమవారం మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆత్మ లింగారెడ్డి మాట్లాడుతూ ప్రణాళిక పేరుతో నిధులను ప్రభుతం దుర్వినియోగం చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రవల్లి రవి పాల్గొన్నారు.