ప్రీమియం బైక్ మేకర్ జావా '42' లైనప్ విస్తరణలో భాగంగా 42 ఎఫ్జేను లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.1.99 లక్షలు. మల్టీ- స్పోక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్డ్- అవుట్ ఇంజన్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, సింగిల్-పాడ్, డిజిటల్ ఇన్స్ట్రమెంట్ క్లస్టర్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.
ఎఫ్జేకు 334 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్- సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 28.7 బీహెచ్పీని, 29.62 ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బుకింగ్స్ మొదలయ్యాయని జావా ప్రకటించింది.