అనాథలమైనం..ఆదుకోండి

అనాథలమైనం..ఆదుకోండి
  • నిలువ నీడలేదు, కడుపునిండా తిండి లేదు
  • కన్నవాళ్లు కాటికెళ్లారు
  • ఆపన్న హస్తం కోసం చిన్నారుల ఎదురుచూపు 

కోడేరు, వెలుగు  : విధి ఆడిన నాటకంలో అమ్మానాన్నను కోల్పోయాం.. మమ్మల్ని ఆదుకునేవారెవ్వరూ లేరు.. ఉండడానికి ఇల్లు లేదు.. కడుపు నిండా తిండి లేదు.. ఆదుకోవాలంటూ ముగ్గురు చిన్నారులు వాపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన బొల్లెద్దుల రాముడు, పద్మ బతుకుదేరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లి కూలి పని చేసేవారు. ప్రమాదవశాత్తు భార్య పద్మ మృతి చెందగా, దిగులుతో అనారోగ్యానికి గురై భర్త రాముడు కాలం చేశాడు.

దీంతో ముగ్గురు చిన్నారులు ఆదిత్య, హర్ష, చిట్టిబాబు బతుకులు రోడ్డున పడ్డారు. చదువులు ఆగిపోయాయి. చేతిలో చిల్లిగవ్వలేదు.  పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ చిన్నారులకు  గురువారం దశదినకర్మ సందర్భంగా పెద్దకొత్తపల్లి మత్స్య సహకార సంఘం రూ.20 వే లు, డబ్బా ఎల్లయ్య రూ.5 వేలు, క్లాస్ మెంట్ క్లబ్ నుంచి రూ.25 కిలోల బియ్యం, నాగులపల్లి ఆర్మీ అంజి మిత్రుల సాయంతో  రూ.12వేలు సాయమందించారు.   తనను, తన తమ్ముళ్లను ఆదుకోవాలంటూ పెద్దకుమార్​ ఆదిత్య వేడుకోవడం చూపరులను కంటతడి పెట్టించింది.  ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ బుల్లెద్దుల లక్ష్మయ్య కోరారు.