
నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం దేశవ్యాప్తంగా 22 లా యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 31లోపు అప్లై చేసుకోవచ్చు. యూజీ, పీజీ పరీక్షల సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ గురించి ఈ వారం తెలుసుకుందాం.
దేశంలోని టాప్ యూనివర్సిటీల్లో లా కోర్సులు చదవాలనుకునే విద్యార్థులకు క్లాట్ఎగ్జామ్ గేట్‌వే లాంటిది. యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందడానికి ఈ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ఱత సాధించాలి. ఇందులోసక్సెస్ అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 22 యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ పొందవచ్చు. మ్యాథ్స్, కరెంట్ ఎఫైర్స్‌తో పాటు లా కు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేస్తే పరీక్షలో విజయం సాధించడం సులువే.
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం
అర్హత: జనరల్ అభ్యర్థులు కనీసం 45% మార్కులతో ఇంటర్మీడియట్(10+2)/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40 శాతం మార్కులు రావాలి, మార్చి/ ఏప్రిల్ 2022లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అర్హులే. గరిష్ట వయోపరిమితి లేదు.
సిలబస్:
అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం నిర్వహించే ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది. దీన్ని ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ పరీక్షలో ఇంగ్లీష్ , కరెంట్ ఎఫైర్స్, లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం
అర్హత: జనరల్ అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఎల్ఎల్‌బీ డిగ్రీ/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు రావాలి. ఏప్రిల్/ మే 2022లో ఎల్ఎల్‌బీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి లేదు.
సెలెక్షన్ ప్రాసెస్:
ఈ పరీక్షలో రెండు సెక్షన్స్ ఉంటాయి. మొదటి సెక్షన్ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. రెండో సెక్షన్లో డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటుంది. ఇందులో రెండు ఎస్సేలకు ఆన్సర్ రాయాలి. ప్రతి ఎస్సేకు 25 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ పరీక్షలో అభ్యర్థులకు 40 శాతం ( ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35శాతం) మార్కులు వస్తేనే డిస్క్రిప్టివ్ పేపర్ కరెక్షన్ చేస్తారు.
సిలబస్
1) కాన్స్టిట్యూషనల్ లా
2) అడ్మినిస్ట్రేటివ్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్, టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ట్యాక్స్ లా, ఇన్విరాన్‌మెంటల్ లా, లేబర్ అండ్ ఇండస్ట్రీయల్ లా.
సెలెక్షన్ ప్రాసెస్: క్లాట్ 2021 పరీక్ష ఆధారంగా.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.4000, ఎస్సీ/ ఎస్టీ/ బీపీఎల్ విద్యార్థులకు రూ.3500
చివరి తేది: 31 మార్చి 2022.
క్లాట్ 2022 ఎగ్జామ్: 8 మే 2022 (మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు)
వెబ్సైట్: www.consortiumofnlus.ac.in
- వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్