హైదరాబాద్లో 80 వేల మ్యాన్​హోల్స్ క్లీనింగ్ పూర్తి : అశోక్​రెడ్డి

  • 1000 కి.మీ. పైప్​లైన్లలో డీసిల్టింగ్

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్ పరిధిలో వాటర్​బోర్డు చేపట్టిన 90 రోజుల స్పెషల్​ డ్రైవ్​తో మంచి ఫలితాలు వస్తున్నాయని బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. సీవరేజీ పైప్​లైన్లు, మ్యాన్​హోల్స్​క్లీనింగ్, డీసిల్టింగ్ తో ఫిర్యాదుల సంఖ్య బాగా తగ్గిందన్నారు. మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో స్పెషల్​డ్రైవ్ పై సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాకా 8 వేల ప్రాంతాల్లో 1000 కిలో మీటర్ల మేర సీవరేజ్ పైపులైన్ కు డీ-సిల్టింగ్ పనులు నిర్వహించినట్లు తెలిపారు. 80 వేల మ్యాన్ హోళ్లను శుభ్రం చేసినట్లు వెల్లడించారు. 

46 రోజులుగా సాగుతున్న డ్రైవ్ లో క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతిభ కనబర్చిన 10 సెక్షన్ల అధికారులను సత్కరించారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీనే తమ లక్ష్యమన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్, డైరెక్టర్ ఆపరేషన్స్-2 స్వామి, పర్సనల్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.