
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేసి జీరో బ్యాక్టీరియల్రిజర్వాయర్లుగా మార్చబోతున్నారు. నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా అధికారులు ప్రతి రోజూ క్లోరినేట్చేసిన నీటినే సరఫరా చేస్తున్నారు. అయితే, రోజుల తరబడి నిల్వ ఉండే రిజర్వాయర్లను కూడా క్లీన్గా ఉంచడమే లక్ష్యంగా దశల వారీగా ఈ పనులు చేయబోతున్నట్టు అధికారులు తెలిపారు.
జర్మన్ టెక్నాలజీతో ట్యాంకుల క్లీనింగ్
ప్రస్తుతం కేపీహెచ్బీ ఫేజ్–4, 6 పరిధుల్లోని 5.0 మిలియన్ లీటర్స్ రిజర్వాయర్, బోరబండలోని 5.0 ఎంఎల్, గాయత్రి నగర్(5.60 ఎంఎల్), ఎల్లమ్మబండ (5.0 ఎంఎల్, 0,60 ఎంఎల్), చింతల్( 4.48 ఎంల్) రిజరాయర్లను క్లీన్ చేయాలని నిర్ణయించారు. ముందుగా వీటిని ఖాళీ చేసి పనులు మొదలుపెడతారు. ఈ క్లీనింగ్పనుల కోసం జర్మనీ స్టేట్ ఆర్ట్ టెక్నాలజీ ఉపయోగించబోతున్నారు.
హైస్పీడ్ప్రెషర్రోటరీ జెట్ క్లీనింగ్, యాంటీ బ్యాక్టీరియల్ సిస్టమ్ ద్వారా క్లీన్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ట్యాంకుల్లో ఉండే సెడిమెంట్, నాచుతో పాటు హానికరమైన బ్యాక్టీరియా కూడా తొలగిపోతోందంటున్నారు. తక్కువ నీళ్లను వాడుకుని, అతి తక్కువ టైంలో శుభ్రం చేయవచ్చంటున్నారు.
ఈ క్లీనింగ్ప్రాసెస్ను టీ క్లీనింగ్ప్రాసెస్ అంటారని, మోటార్కు ఉండే హై ప్రెషర్రోటరీ జెట్కు ఉన్న నాజిల్తో నీటిని ఫ్రెషర్తో రిలీజ్ చేస్తుందని, దీంతో ట్యాంకుల్లో పేరుకున్న మట్టి, నాచు, బ్యాక్టీయాను, ట్యాంక్ గోడలకు పేరుకుపోయిన మురికి చాలా సులభంగా క్లీన్ అవుతుందంటున్నారు.
Also Read:-భూదాన్ భూముల ఇష్యూ.. ఓల్డ్ సిటీలో ఈడీ తనిఖీలు
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ఎక్విప్మెంట్నీటిలో ఉండే కాలుష్యాన్ని సులభంగా తొలగిస్తుందని అంటున్నారు. ఈ వేసవిలోనే ట్యాంకులను క్లీన్చేసి వచ్చే నెల నుంచి మరింత స్వచ్ఛమైన నీటిని అందిస్తామని చెప్తున్నారు. రోజువారీ నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా దశల వారీగా ట్యాంకుల క్లీనింగ్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.