విండో క్లీనింగ్​ రోబో​.. ఇప్పుడు హోమ్ క్లీనింగ్ చాలా ఈజీ

విండో క్లీనింగ్​ రోబో​.. ఇప్పుడు హోమ్ క్లీనింగ్ చాలా ఈజీ

ఇదివరకటితో పోలిస్తే.. ఇళ్లకు ఇప్పుడు చాలామంది అద్దాల కిటికీలను పెట్టుకుంటున్నారు.  వాటిని క్లీన్​ చేయడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ.. ఈ రోబో క్లీనర్​ చాలా ఈజీగా కిటికీల అద్దాలను క్లీన్​ చేసేస్తుంది. దీన్ని ఎఫ్​మార్ట్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. 

డబుల్ డిస్క్ డిజైన్​తో తీసుకొచ్చిన ఈ క్లీనర్​ ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. 4 నిమిషాల్లో 16.15 చదరపు అడుగుల అద్దాన్ని క్లీన్​ చేస్తుంది. పూర్తి ఆటోమెటిక్​గా పనిచేస్తుంది. క్లీనింగ్​ పూర్తైన తర్వాత తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చేస్తుంది. పెద్ద, ఎత్తైన కిటికీలకు ఇది బెస్ట్‌‌‌‌‌‌‌‌. దీనికి ఉండే అల్ట్రా-ఫైన్ ఫైబర్ క్లాత్​లు చిన్న ధూళి కణాలను కూడా తుడిచేస్తాయి. 

దీనికి 16.5- అడుగుల క్లైంబింగ్ సేఫ్టీ రోప్, ఎడ్జ్ డిటెక్టర్లు ఉంటాయి. రిమోట్​తో కూడా ఆపరేట్​ చేయొచ్చు. దీంతో  డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్​ లాంటివి కూడా క్లీన్​ చేయొచ్చు. 

ధర
12,889