ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్ బ్రౌజర్ మీరు చూసిన వెబ్‌సైట్స్ నుంచి చాలా ఫైల్స్, ఇమేజెస్, డాటాను తీసుకుంటుంది. సింపుల్‌గా ఫోన్‌కి అదో భారం అని చెప్పొచ్చు. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్, సామ్సంగ్ ఇంటర్నెట్... ఏది వాడినా కూడా డాటా మాత్రం కుకీస్, క్యాచెల్లో స్టోర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అంటే... ఎక్కువసార్లు చూసే వెబ్‌సైట్స్ వెంటనే యాక్సెస్ చేసేందుకు, మీకున్న అకౌంట్స్‌లో లాగ్ అయి ఉండేందుకు ఆ డాటా అవసరమవుతుంది. అంతవరకు ఓకే. కానీ బ్రౌజర్లో ఉండే కుకీస్, క్యాచెలో ఉండే చాలా సమాచారం ఏమాత్రం అవసరం లేనిది. అది కొన్నిసార్లు ప్రైవసీకి రిస్క్ అవుతుంది.
ఎందుకు రెగ్యులర్‌గా తీసేయాలి?
కుకీస్, క్యాచెలో అనేది ప్లెయిన్ జంక్. ఒక్కసారి చూసిన వెబ్‌సైట్స్ నుంచి కూడా ఈ జంక్ వచ్చి చేరుతుంది. మిగతాది బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేస్తుంది. దాని ద్వారా మీకు అడ్వర్టైజ్మెంట్స్ చూపెడుతుంటుంది. అదెలాగంటే... ఏం కొంటున్నారు? ఇంటర్నెట్లో ఏం స్ట్రీమ్ చేస్తున్నారు? అనే దాన్ని బట్టి అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తుంటుంది. ఉదాహరణకి... కంటి అద్దాలు కొనాలనుకుని కొన్ని ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసినా అమెజాన్ షాపింగ్ కార్ట్‌లో కొనాలనుకున్న వస్తువులను యాడ్ చేసినా ఆ సమాచారం ద్వారా వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ పదే పదే వస్తుంటాయి.
అందుకనే ఎప్పటికప్పుడు క్యాచె క్లియర్ చేస్తుండాలి. అలా చేయడం వల్ల ఫోన్లో చేరిన అవసరంలేని డాటా డిలీట్ అయిపోతుంది. ప్రత్యేకించి ఫోన్ కుకీస్ నుంచి తెలియకుండానే డాటా ట్రాకర్ ఉండే అవకాశం ఉంది. అందుకే అంతా క్లియర్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల ఒక చిన్న అసౌకర్యం ఉంటుంది. అదే రెగ్యులర్‌గా విజిట్ చేసే, నచ్చిన వెబ్‌సైట్స్‌ను లాగ్ బ్యాక్ చేయాల్సి వస్తుంది. కానీ ఫోన్ ట్రాక్ కాకుండా, పైరసీ బారిన ఉంటుంది కాబట్టి ఆ చిన్న అసౌకర్యాన్ని భరించొచ్చు.
అయితే ఫోన్, వెబ్ బ్రౌజర్ అప్లికేషన్ బట్టి క్యాచె క్లియర్ చేసే స్టెప్స్ వేరుగా ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్లకు డిఫాల్ట్‌గా క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. గెలాక్సీ ఫోన్ సిరీస్‌లో సామ్సంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్, మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్. యాపిల్ డివైజెస్ వాడే వాళ్లు ఐఫోన్ వెబ్ బ్రౌజర్లో క్యాచె ఎలా క్లియర్ చేయాలో చూసుకోవాలి.
గూగుల్ క్రోమ్
గూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ వెర్షన్లో బ్రౌజర్ పైన కుడివైపు నిలువుగా మూడు చుక్కలు కనిపిస్తాయి. అక్కడ ‘మోర్’ అనే బటన్ ట్యాప్ చేసి తరువాత హిస్టరీ మీద ట్యాప్ చేయాలి. అప్పుడు డిలీట్ బ్రౌజింగ్ డాటా ఆప్షన్ వస్తుంది. ఆ బటన్ నొక్కితే జంక్ డిలీట్ అయిపోతుంది. అదే క్రోమ్ సెట్టింగ్ మెనులో అయితే ప్రైవసీ అండ్ సెక్యురిటీ ట్యాప్ చేసి బ్రౌజింగ్ డాటా డిలీట్ చేయొచ్చు.
అలాగే క్రోమ్ బేసిక్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లో బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్, సైట్ డాటా, క్యాచె ఇమేజెస్, ఫైల్స్ డిలీట్ చేయొచ్చు. అలాగే ఇందులో టైం రేంజ్ డ్రాప్ డౌన్ చేసి సెలక్ట్ చేసుకుని హిస్టరీ డిలీట్ చేయాలి అనుకున్నా, ఆరోజు 24 గంటల్లో కొంత డాటాను సెలక్ట్ చేసి డిలీట్ చేయాలనుకున్నా లేదా ఆ నెలలో వాడిన డాటాలో కొంత డిలీట్ చేయాలి అనుకున్నా అంత మేరకు సెలక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు.
అడ్వాన్స్డ్ అనేది టాప్ చేసి కైడా సేవ్ అయిన పాస్వర్డ్స్, ఆటోఫిల్ ఫార్మ్ డాటా, సైట్ సెట్టింగ్స్ కూడా డిలీట్ చేయొచ్చు. నీలం రంగులో ఉండే క్లియర్ డాటా అనే బటన్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. అప్పుడు అడిషనల్ ప్రాంప్ట్ వస్తుంది. ఎందుకంటే కొన్ని వెబ్‌సైట్స్ మీకు అవసరం అనిపించి క్రోమ్ ఆ ప్రాంప్ట్ ఇస్తుంది. అలాంటప్పుడు వాటిని ఒకసారి చెక్ చేసుకుని క్లియర్ చేసేముందు కన్ఫర్మ్ చేయాలి. క్రోమ్ ఇలాంటి ప్రాంప్ట్ ఇవ్వలేదంటే క్లియర్ చేయమని ఇన్‌స్ట్రక్ట్ చేస్తుంది.
సామ్సంగ్ ఇంటర్నెట్
సామ్సంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్లో రెండు రకాలుగా క్యాచె, కుకీస్ డాటా క్లియర్ చేయొచ్చు. అవి బ్రౌజర్లో చేయడం ఒక పద్ధతి. ఫోన్లో సెట్టింగ్స్ అప్లికేషన్ నుంచి క్లియర్ చేయడం రెండో పద్ధతి. సామ్సంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్ అప్లికేషన్లో చేస్తుంటే మొదట ఆప్షన్స్ బటన్ ట్యాప్ చేయాలి. ఇది కింది భాగంలో కుడి మూలవైపు మూడు చుక్కల దగ్గర ఉంటుంది. ఆ తరువాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్ర్కోల్ డౌన్ చేసి పర్సనల్ బ్రౌజింగ్ డాటా ట్యాప్ చేయాలి. అక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ నుంచి బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేసేయొచ్చు. ఫార్మ్, సెర్చ్ హిస్టరీ, కుకీస్, సైట్ డాటా, క్యాచ్డ్ ఇమేజెస్, ఫైల్స్, పాస్ వర్డ్స్, ఆటోఫిల్ ఫార్మ్స్... ఏ కాంబినేషన్లో అయినా డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ డాటా ట్యాప్ చేస్తే మీ ఛాయిస్ అడుగుతుంది ఆ తరువాత డిలీట్ చేస్తుంది.
బ్రౌజర్ అప్లికేషన్ ద్వారా అయితే కస్టమైజేషన్ అంటే... ఏం డిలీట్ చేయాలి అనుకుంటునేది సెలక్ట్ చేసుకోవచ్చు. అలాకాకుండా ఫోన్ సెట్టింగ్స్ మెనులో ఉన్న ఆప్షన్స్ లాంటివే యాక్సెస్ చేయాలి అనుకుంటే సెట్టింగ్స్‌ను అప్లికేషన్లో ట్యాప్ చేసి ఓపెన్ చేయాలి. ఆ తరువాత స్క్రోల్ డౌన్ చేసి సామ్సంగ్ ఇంటర్నెట్‌ని ట్యాప్ చేయాలి. తరువాత స్టోరేజి, క్యాచెకి వెళ్లాలి. స్టోరేజి స్క్రీన్ మీద క్లియర్ క్యాచె, క్లియర్ స్టోరేజి అనే ఆప్షన్ వస్తుంది. క్లియర్ క్యాచె చేస్తే వెంటనే క్యాచె డిలీట్ అయిపోతుంది. కానీ క్లియర్ స్టోరేజి అంటే మాత్రం ప్రాంప్ట్ వార్నింగ్ ఇస్తుంది.
ఎందుకంటే స్టోరేజి క్లియరెన్స్‌లో అన్ని అప్లికేషన్స్ డాటా పూర్తిగా డిలీట్ అయిపోతుంది. అందులో ఫైల్స్, సెట్టింగ్స్, అకౌంట్స్, డాటాబేస్ వంటివన్నీ ఉంటాయి. ఇది ప్రత్యేకించి కుకీస్‌ను చూపించదు. న్యూక్లియర్ అప్రోచ్ ఉంటుంది. మిగిలిన డాటా అంతా తీసేస్తుంది. ఆ తరువాత సామ్సంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేస్తే బ్రాండ్ న్యూ ప్రొడక్ట్‌గా మారిపోతుంది.
మొజిల్లా ఫైర్ఫాక్స్
గూగుల్ క్రోమ్లాగానే మొజిల్లా ఫైర్ఫాక్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లోనే క్యాచె క్లియర్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ యాక్సెస్ చేసేందుకు మోర్ బటన్ ట్యాప్ చేయాలి. ఈ బటన్ అడ్రెస్ బార్కి కుడి వైపున ఉంటుంది. అక్కడ నిలువు వరసలో మూడు చుక్కలు ఉంటాయి. సెట్టింగ్స్ ట్యాప్ చేయాలి. తరువాత స్క్రోల్ డౌన్ చేసి బ్రౌజింగ్ డాటా డిలీట్ చేయాలి.
మూడు వెబ్ బ్రౌజర్లలో క్యాచె ఎలా క్లియర్ చేయాలో చెప్పుకున్నాం. అయితే ఫైర్ఫాక్స్ డిలీట్ బ్రౌజింగ్ డాటా మెను కింద ఎక్కువ ఆప్షన్స్ ఇస్తుంది. ఇందులో ఓపెన్ ట్యాబ్స్ కూడా డిలీట్ చేయొచ్చు. బ్రౌజింగ్ హిస్టరీ, సైట్ పర్మిషన్స్, డౌన్లోడ్స్ ఫోల్డర్స్తో పాటు కుకీస్, సైడ్ డాటా, క్యాచ్డ్ ఇమేజెస్, ఫైల్స్ కూడా తీసేయొచ్చు. అయితే టైం రేంజ్‌కి ఇందులో అవకాశం లేదు. క్రోమ్‌లో ఆ ఆప్షన్ ఉంది. అలాగే ఎలాంటి టైప్ డాటా రిమూవ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు.
అదే ఫైర్‌ఫాక్స్‌లో అయితే అదనంగా ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే ఆ అప్లికేషన్ వాడాక డాటా వద్దనుకుంటే అప్పటికప్పుడు డిలీట్ చేసేయొచ్చు. అందులో సెట్టింగ్స్‌లోనే క్విట్ అనే ఆప్షన్లో డిలీట్ బ్రౌజింగ్ డాటా ఉంటుంది. అప్లికేషన్ క్విట్ చేసిన ప్రతిసారీ ఈ కాంబినేషన్లో ఉన్న అదే సెట్టింగ్స్‌ను తీసేయమని ఫైర్‌ఫాక్స్‌ను ఇన్‌స్ట్రక్ట్ చేస్తుంది. బ్రౌజర్‌ను నీట్‌గా ఉంచుకోవాలంటే ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్. ఒకవేళ అనుకోకుండా మీ బ్రౌజింగ్ హిస్టరీని ఎవరి చేతిలోనైనా పడితే వాళ్లు దాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది. లేదంటే ఫోన్‌ని వాళ్లు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.