బ్రౌజర్‌లు, గేమ్‌లు, స్ట్రీమింగ్ సర్వీసెస్ వంటి అప్లికేషన్‌లలో యూజర్స్ ఎక్స్ పీరియన్స్ ను ఆప్టిమైజ్ చేయడంలో క్యాచ్ డేటా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఫైల్స్ ను స్టోర్ చేయడానికి అప్లికేషన్‌లను అనుమతిస్తుంది. దీని ఫలితంగా ఫోన్ స్పీడ్ అవుతుంది, స్మూత్ గా పనిచేస్తుందన్న భావన కలుగుతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో క్రోమ్ వంటి బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, బ్రౌజర్ వెబ్‌సైట్‌ల నుంచి నిర్దిష్ట సమాచారాన్ని క్యాచ్ , కుక్కీలలో సేవ్ చేస్తుంది. అయితే, కొన్నిసార్లు వెబ్‌సైట్‌లలో లోడ్ సమస్యలు లేదా ఫార్మాటింగ్ అవాంతరాలు వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ క్యాచ్ చేసిన డేటాను క్లియర్ చేయడం అవసరం అవుతుంది. ఈ ప్రక్రియలో యూజర్స్ కు సహాయం చేయడానికి, ఆండ్రాయిడ్ (Android) ఫోన్‌లో క్యాచ్ ఫైల్స్ ను ఎలా క్లియర్ చేయాలో ఇప్పుడు చూద్దాం:
- మీ Android స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Chrome యాప్‌ని తెరవండి
- ఇప్పుడు స్క్రీన్ కుడి వైపున మూలలో ఉన్న 'More' ఆప్షన్ పై నొక్కండి
- కనిపించే మెను నుంచి హిస్టరీని ఎంచుకుని, ఆపై బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయి (Clear browsing data)పై నొక్కండి.
- ఆ తర్వాత "ఆల్ టైమ్(All time)" ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా క్యాచ్ చేసిన మొత్తం డేటాను తొలగించడానికి నిర్దిష్ట సమయ పరిధిని ఎంచుకునే అవకాశం లభిస్తుంది.
- "క్యాచ్ చేయబడిన ఫొటోలు, ఫైల్‌లు", ఇతర "కుకీలు, సైట్ డేటా" ప్రక్కన ఉంచబడిన బాక్స్ ను ఎంచుకోండి
- చివరగా, క్యాచ్ క్లియరింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి డేటాను క్లియర్ చేయిపై నొక్కండి.
కాలక్రమేణా, ఈ క్యాచ్ చేసిన ఫైల్‌లు అధిక సంఖ్యలో స్టోర్ అయ్యి ఓవర్‌లోడ్ అవుతాయి, ఇది మీ Android ఫోన్‌లో పనితీరు సమస్యలకు దారి తీస్తుంది. ఇది ఫోన్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఫోన్‌లో క్యాచ్ ను క్లియర్ చేయడం వలన ఫోన్ యూజింగ్ ను ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది, ఫలితంగా సామర్థ్యం కూడా పెరుగుతుంది.
క్యాచ్ ను క్రమం తప్పకుండా క్లియర్ చేయడం ద్వారా, యూజర్స్ సున్నితమైన అనుభవాన్ని పొందుతారు. ఈ క్యాచ్-క్లియరింగ్ ప్రక్రియ బ్రౌజర్‌కే కాకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోని ఇతర అప్లికేషన్‌లకు కూడా వర్తింపజేయవచ్చు.