నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ..

పిల్లలు.. మనం ఎలా నేర్పిస్తే అలానే చేస్తారు.. ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడటం నేర్చుకుంటారు.. ఈ చిన్నారి విషయంలో మాత్రం అందుకు అతీతం.. అవును.. ఈ చిన్నారి వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే.. ఈ పాప అచ్చం.. సింహం ఎలా అయితే గర్జిస్తుందో.. అచ్చం అలాగే గర్జిస్తుంది. సింహం ఎలా సౌండ్ చేస్తుంది అని ప్రశ్నిస్తే.. గాలి లోపలికి పీల్చుకుని.. సింహం లాగే గర్జన సౌండ్ చేస్తుంది.. ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఈ వీడియో విశేషాలు మరిన్ని తెలుసుకుందామా...

వీడియోలోని ఈ చిన్నారి పేరు  ఆరాధ్య స్టార్ రిలే .. వయసు 5 సంవత్సరాలు.  ఆమె తల్లి అమీ క్రమం తప్పకుండా ఈ చిన్నారి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.  తాజాగా షేర్ చేసిన వీడియోలో ఈ చిన్నారి అచ్చం సింహంలాగే  గర్జన చేస్తుంది. కళ్లు ముసుకుని వింటే  మనకు కూడా పక్కన సింహం గర్జించినట్లుగానే అనిపిస్తుంది.  

ఏప్రిల్ 25వ తేదీన షేర్ చేయబడిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోను  8 లక్షలకు పైగా యూజర్లు చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ తమ అభిప్రాయలను వెల్లడిస్తున్నారు.  బహుశా ఈ పాప సింహరాశిలో పుట్టింది కావచ్చు అని ఒక నెటిజన్ అంటే..  సింహనికి డబ్బింగ్ చెప్పాలంటే ఈ చిన్నారిని తీసుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.