- లంచ్ పేరుతో ప్రైమరీ స్కూళ్లు మధ్యాహ్నమే మూసివేత
- హైస్కూల్ హెచ్ఎంలు సైతం పార్టీకి హాజరు?
హైదరాబాద్ సిటీ, వెలుగు: తీవ్ర విమర్శలకు దారితీసింది. గవర్నమెంట్ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగాలి. అయితే షేక్ పేట మండల పరిధిలోని 20 ప్రైమరీ స్కూళ్లను శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకే క్లోజ్చేశారు.
ఇటీవల కొత్తగా స్కూళ్లకు వచ్చిన ఎస్జీటీలు, సీనియర్ఎస్జీటీలు అంతా కలిసి బంజారాహిల్స్‌లోని గతి స్కూల్‌కు చేరుకున్నారు. అక్కడ అంతా కలిసి లంచ్పార్టీ చేసుకున్నారు. ఈ విందుకు ఎస్టీటీలతోపాటు మండలంలోని 7 హైస్కూళ్ల హెచ్ఎంలు సైతం హాజరైనట్లు సమాచారం.
ALSO READ : వాట్సాప్లో ఫేక్ డీపీ పెట్టి.. 1.79 లక్షల మోసం
అయితే స్కూళ్లు బంద్‌పెట్టి మరీ టీచర్లు పార్టీ చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీచర్ల పర్సనల్పార్టీలు, విందులు ఏమైనా ఉంటే సెలవు రోజుల్లో చేసుకోవాలని కానీ స్కూల్వర్కింగ్ డేస్ లో నిర్వహించుకోవడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ పార్టీ షేక్‌పేట మండల డిప్యూటీ ఐఓఎస్అనుమతితో జరగడం గమనార్హం.