Credit Cards: క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్‌కి దెబ్బే.. ఇలా చేస్తే సేఫ్..!

Credit Cards: క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్‌కి దెబ్బే.. ఇలా చేస్తే సేఫ్..!

Credit Score: ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నందున సులువుగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి క్రెడిట్ కార్డులను పొందుతున్నారు. కొంత మంది వద్ద ఇవి మితంగానే ఉంటున్నప్పటికీ మరికొందరి వద్ద మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు కార్డులను సక్రమంగా వినియోగించుకోవటంతో పాటు సకాలంలో ఆ బిల్లుల చెల్లింపులను మిస్ కాకుండా కడుతుంటారు. కొందరి విషయంలో ఇది గాడి తప్పుతుంది. తమ ఆర్థిక స్థోమతకు మించి కార్డును వినియోగించే కొందరు వాటిని కొన్ని సార్లు క్లోజ్ చేసుకోవాలని చూస్తుంటారు. వాస్తవానికి వారి దృష్టిలో ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ ఇది సదరు వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌ని భారీగా దెబ్బతీస్తుంది. 

ఇక్కడ చాలా మందికి కలిగే అనుమానం అసలు క్రెడిట్ స్కోరుకు క్రెడిట్ కార్డును క్లోజ్ చేయటానికి మధ్య ఉండే సంబంధం ఏంటన్నదే. భారతదేశంలో నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డును క్లోజ్ చేయటం వల్ల అది వ్యక్తి క్రెడిట్ హిస్టరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని గమనించాలి. అయితే మీ క్రెడిట్ స్కోర్ లేదా హెల్త్ పాడవకుండా తెలివిగా కార్డులను ఎలా క్రోజ్ చేసుకోవచ్చనే విషయాలను తెలుసుకోవాల్సిందే.. 

Also Read:-టెస్లాకే జై కొట్టిన ఇండియా.. BYDకి నో చెప్పేసిన పీయూష్ గోయల్, ఎందుకంటే?

* ఒక్కసారిగా మీరు క్రెడిట్ కార్డును క్లోజ్ చేయటం ద్వారా మీ క్రెడిట్ యుటిలైజేషన్ పెరిగి స్కోర్ దెబ్బతీస్తుంది. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అధికంగా ఉంటే మీరు అధికంగా రుణాలపై ఆధాపడుతున్నట్లు అర్థం. అందువల్ల మెరుగైన క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటానికి మెుత్తం అందుబాటులోని కార్డుల లిమిట్‌లో కేవలం 30 శాతాన్ని మాత్రమే వాడటం ఉత్తమం.

* ఇక మీరు ఏదైనా క్రెడిట్ కార్డును క్లోజ్ చేయటం ద్వారా మీ క్రెడిట్ హిస్టరీ నుంచి దాని వివరాలు తొలగించబడతాయి. ఉదాహరణకు మీరు పాత క్రెడిట్ కార్డును క్లోజ్ చేస్తే అది మీకు తక్కువ క్రెడిట్ హిస్టరీనికి కలిగి ఉండేలా చేస్తుంది. దీంతో క్రెడిట్ హిస్టరీ వయస్సును తగ్గిస్తుంది. అలాగే సమయానికి కార్డు చెల్లింపులను సైతం క్రెడిట్ రిపోర్టులో పరిగణలోకి తీసుకుంటారు. అందువల్ల మంచి క్రెడిట్ పేమెంట్ హిస్టరీని కలిగిన కార్డును తొలగించటం మీ క్రెడిట్ వర్థీనెస్ తగ్గేలా చేస్తుందని గమనించాలి.

మీరు ఎలాంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డును క్లోజ్ చేయటం ఉత్తమం..?
కార్డులను క్లోజ్ చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, కొన్ని సరైన కారణాలను చూపుతూ క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయటం మంచిది.
- తక్కువ ప్రయోజనాలను కలిగిన ఎక్కువ యాన్యువల్ ఫీజుండే కార్డులు
- సెక్యూరిటీ లేదా మోసం వంటి కారణాలు
- ఉన్న కార్డు కంటే మెరుగైన రివార్డ్స్, వడ్డీ రేట్లను కలిగి ఉండే క్రెడిట్ కార్డుకు మారటం
- మిగిలిపోయిన చిన్న చెల్లింపులను కూడా భారీ మొత్తాలుగా పెంచటం

ఈ టిప్స్ పాటించటం వల్ల కార్డు క్లోజ్ చేసినప్పుడు సిబిల్ స్కోరుపై ప్రభావం తక్కువగా ఉండే అవకాశం..
- ఎలాంటి వార్షిక రుసుములు లేని పాత కార్డులను కొనసాగించటం
- ఒకేసారి అనేక క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయకుండా ఉండటం
- కార్డులను క్లోజ్ చేసిన తర్వాత, చేయటానికి ముందు క్రెడిట్ స్కోరులోని తేడాలను పరిశీలించటం
- కార్డును యాక్టివ్ గా ఉంచేందుకు తరచుగా దానిని వినియోగంలో ఉంచటం