కరీంనగర్ సిటీ, వెలుగు : గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని కరీంనగర్ కలెక్టరేట్‌లో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేశాడు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించారు. గాంధీ రోడ్డులో బట్టల దుకాణాలు, మహిళలకు సంబంధించిన షాపులుండే ప్రాంతంలో ఓ వైన్ షాపు ఉంది.
అక్కడికి మహిళలు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, దీంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, ఆ వైన్‌షాపును తొలగించాలని గతంలో ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. సోమవారం మళ్లీ అర్జీ అందజేశారు. గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు సమస్యను పరిష్కరించలేదని ఆరోపిస్తూ వెంగళదాసు అశోక్అనే వస్త్ర వ్యాపారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయాడు. తోటి వ్యాపారులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.