
పద్మారావునగర్, వెలుగు: సిటీలో దుర్భర జీవితం గడుపుతున్న అభాగ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని స్కై ఫౌండేషన్ ఆర్గనైజర్లు కోరారు. ఆదివారం సిటీలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న అనాథలు, సంచార జాతుల వారికి దుప్పట్లు, దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్లు, మందులను పంపిణీ చేశారు. వీరికి ప్రభుత్వం శాశ్వత నివాసంతోపాటు పని కల్పిస్తే.. విశ్వనగరంగా పిలుచుకునే హైదరాబాద్బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మారుతుందని ఫౌండేషన్ నిర్వాహకులు సంజీవ్ కుమార్, పావని తెలిపారు.