హైదరాబాద్లో క్లౌడ్ బరస్ట్.. 6 అడుగుల పరిధిలోనే కురిసిన వర్షం

క్లౌడ్ బరస్ట్ గురించి అప్పుడప్పుడు వింటుంటాం కదా.. హిమాలయ పర్వత పాదంలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ వంటి రాష్ట్రా ల్లో క్లౌడ్ బరస్ట్ ఎక్కువగా సంభవిస్తుంది. దీంతో అక్కడి ప్రాంతాలు ఒక్కసారిగా వరదబారినపడతాయి..ఇదంతా మనం సోషల్ మీడియాలో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం.. అయితే శుక్రవారం ఆగస్టు 23, 2024 నాడు మన హైదరాబాద్ లో కూడా క్లౌడ్ బరస్ట్ సంభవించింది.. ఇది నిజం.. కావాలంటే ఈ వీడియోను చూడండి.

హైదరాబాద్ నగరంలోని మురాద్  నగర్ పోస్టాఫీసు లైన్ లో క్లౌడ్ బరస్ట్ అయ్యి.. కేవలం 6అడుగుల పరిధిలోని భారీగా వర్షం కురిసింది. ఈ అనుకోని సంఘటనను కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాగా వైరల్ అవుతుంది. 

ALSO READ | సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో మంటలు: ప్లేట్లు వదిలేసి పరుగులు తీసిన కస్టమర్లు