
- ఈ ఏడాది సైబర్ నేరాలతో కంపెనీలకు రూ.20 వేల కోట్లు లాస్
- క్లౌడ్‌సెక్ రిపోర్ట్
న్యూఢిల్లీ: సైబర్ నేరాల వలన ఈ ఏడాది ఇండియన్ కంపెనీలు రూ.20 వేల కోట్లు నష్టపోయే అవకాశం ఉందని సైబర్‌సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్‌సెక్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. వివిధ సెక్టార్లలోని 200 కి పైగా కంపెనీల పరిస్థితులను, 5 వేల డొమైన్‌లను, 16 వేల నకిలీ బ్రాండ్ల వివరాలను, దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల విధానాలను విశ్లేషించి ఈ రిపోర్ట్ రెడీ చేశామని కంపెనీ పేర్కొంది.
సైబర్ నేరగాళ్లు బ్రాండ్ల నకిలీ కాపీలను తయారు చేయడంతో కంపెనీలకు ఈ ఏడాది రూ.9 వేల కోట్ల లాస్ వస్తుందని క్లౌడ్‌సెక్ అంచనా వేసింది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరింది. సైబర్ నేరాలపై ఫిర్యాదులు 25 లక్షలను దాటొచ్చని, నకిలీ బ్రాండ్లకు సంబంధించే 5 లక్షల ఫిర్యాదులు రావొచ్చని పేర్కొంది.