వంటింట్లో దొరికే చాలా రకాల ఆహార పదార్థాలతో చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఏదైనా అనారోగ్యం బారిన పడితే ఆసుపత్రికి వెళ్లకుండానే వంటింట్లో లభించే ఆహారపదార్థాలను తీసుకుని అనారోగ్యానికి చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి మాత్రమే ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తాయని అనుకుంటారు. కానీ వంటింట్లో దొరికే మసాలా దినుసులు కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలు చేస్తాయి. మసాలా దినుసులను చాలా రకాల ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తుంటారు. అందులో ముఖ్యంగా లవంగాలు దివ్యఔషధం అనే చెప్పాలి.
లవంగాలు చాలా రకాల అనారోగ్య సమస్యలకు నివారణగా పనిచేస్తాయి. లవంగాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజుకు రెండు తిన్నారంటే అనేక సమస్యల నుంచి కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్, పొటాషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్, ఐరన్, కార్బోహైడ్రేట్లు వంటివి ఉండడం వల్ల ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. లవంగాలను ప్రతీరోజూ రెండు చొప్పున తీసుకోవడం వల్ల డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధికి చెక్ పెట్టవచ్చు. శరీరంలో ఇన్సులిన్ చర్యను మెరుగుపరచడంలోను ఇది తోడ్పడుతుంది.
ప్రతీరోజూ రాత్రి భోజనం తర్వాత రెండు లేదా మూడు లవంగాలను తినడం వల్ల శరీరంలోని కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. అంతేకాదు ఒత్తిడి, ఆయాసం, జీర్ణక్రియ వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా శరీరంలో కొత్త కణాలను ఉత్పత్తి చేయడంలోను సహాయపడుతుంది. సైనస్ వంటి సమస్యతో బాధపడేవారు లవంగాలను పొడి చేసి నీళ్లలో తడిపి దానిని ముక్కు దగ్గర పెట్టుకుంటే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. లవంగాలతో క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధిని నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
లవంగాలతో పాటు తులసి, పుదీనా, యాలకులను కూడా కలిపి కషాయం చేసుకుని తాగడం వల్ల నరాల బలహీనత, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తగ్గించుకోవచ్చు.లవంగాలను తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా అధిక బరువు వంటి సమస్యతో బాధపడేవారికి లవంగాలు సహాయపడతాయి. వీటిని తినడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దంతాల సమస్య, నోటి దుర్వాస వంటి సమస్యలు ఉంటే నోటిలోని చెడు బ్యాక్టీరియాను తొలగించేలా చేస్తుంది.