IND vs AUS: విదూషకుడు కోహ్లీ.. భారత స్టార్‌పై ఆసీస్ మీడియా అడ్డగోలు కథనాలు

IND vs AUS: విదూషకుడు కోహ్లీ.. భారత స్టార్‌పై ఆసీస్ మీడియా అడ్డగోలు కథనాలు

బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజు ఆటలో భారత స్టార్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ ఆటగాడు సామ్ కొంటాస్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. పిచ్ పక్కన నడిచే సమయంలో భారత బ్యాటర్.. ఆసీస్ యువ ఆటగాడి భుజాన్ని భౌతికంగా తాకుతూ నడిచి వెళ్లడం ఈ వాగ్వాదానికి దారితీసింది. ఈ గొడవను ప్రామాణికంగా తీసుకొని ఆతిథ్య ఆస్ట్రేలియా మీడియా.. విరాట్ కోహ్లీపై అడ్డగోలు కథనాలు ప్రచురించింది. 

విదూషకుడు

"విదూషకుడు కోహ్లీ' అనే హెడ్‌లైన్‌తో 'ది వెస్ట్ ఆస్ట్రేలియన్' భారత మాజీ కెప్టెన్‌ను అవమానించేలా కథనాన్ని ప్రచురించింది. విదూషకుడు అంటే.. హాస్యనటుడు, జోకర్, బఫూన్, హేళన చేసేవాడు అని అర్థం. ఇంకా చెప్పాలంటే.. వార్తలో కోహ్లీని సూక్ అని సంభోదించింది. దీనర్థం ఏడుపుకుంటోడు లేదా పిరికివాడని. ఇలా టీఆర్పీ కోసం అడ్డగోలుగా, ఇష్టమొచ్చినట్లు రాసుకొచ్చింది. ఈ కథనాలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్ ట్యాంపరింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన ఆసీస్ క్రికెటర్ల ఫోటోలను పోస్ట్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు.

ALSO READ : PAK vs SA: ఛీ ఛీ.. బండబూతు.. సఫారీ క్రికెటర్లను దుర్భాషలాడిన పాక్ బ్యాటర్

జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్

ఇక కొంటాస్ తో జరిగిన గొడవలో ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్.. భారత స్టార్‌దే తప్పని తేల్చారు. ఈ క్రమంలో కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.