ఆ రెండు పార్టీలు ఒకటే: సీఎల్పీనేత భట్టి
బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అసలు స్వరూపం బయటపడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గవర్నర్, సీఎం కేసీఆర్ కలిసి రాష్ట్రపతిని ఆహ్వానించడాన్ని ఆయన తప్పుపట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ వేర్వేరు కాదని..ఆ రెండు పార్టీలు కలిసి నాటకం ఆడుతూ ప్రజలను మభ్య పెడుతున్నాయని విమర్శలు గుప్పించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు, జాతీయ జెండా ఆవిష్కరణ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడు గవర్నర్ తో కలిసి మాట్లాడటం కానీ, ఎదురుపడటానికి ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు సయోధ్య కుదుర్చుకున్నాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ ధోరణి తో కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలు భయం నీడలో బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటించడం లేదని పేర్కొన్నారు. వారికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన అధికార యంత్రాంగాన్ని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాడడం దురదృష్టకరం అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ ధోరణితో కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలు భయం నీడలో బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.ప్రొఫెసర్ హారగోపాల్ లాంటి విద్యావేత్తలపూ కుట్రపూరితంగా దేశ ద్రోహం (ఉపా) కేసులో ఇరికించడం అన్యాయమన్నారు భట్టి. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాలు, ధరణితో భూ కుంభకోణం, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ అక్రమాలు, హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూముల అమ్మకాలు అక్రమంగా జరిగాయి ఆరోపించారు.