- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
చింతకాని, వెలుగు : ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చుకొని.. సర్కారు సంపదను అందరం పంచుకుందామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మండల పరిధిలోని గాంధీ నగర్ అనంతసాగరం బొప్పారం గ్రామాలలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కంటే మెరుగ్గా బతకాలని తెలంగాణ తెచ్చుకుంటే.. దొరలు ప్రజల వనరులను దోచుకొని కోట్లు వెనకేసుకున్నారు తప్ప కల సాకారం చేయలేదన్నారు.
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ హైకమాండ్‌తో మాట్లాడి ఆరు గ్యారంటీలు తీసుకువచ్చామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.