పంచెకట్టు నుంచి హావభావాల వరకూ వైఎస్ఆర్ ను ఫాలో అవుతున్న భట్టి

సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో పూర్తిగా దివంగత నేత YSRను ఫాలో అవుతున్నారట. ప్రతి విషయంలోనూ వైఎస్ నే అనుకరిస్తున్నారని ఆయన అనుచరులే మాట్లాడుకుంటున్నారు. YS పంచెకట్టుతో సహా హావభావాల వరకు అన్నీ ఫాలో అవుతున్నారట. ప్రజలతో మాట్లడటం, అభివాదం చేయడం అన్నీ వైఎస్ లా ఉండేలా చేస్తున్నారట భట్టి. 

భట్టి విక్రమార్క.. వైఎస్ఆర్ ను రాజకీయ గురువుగా భావిస్తారని, ఇప్పటికీ అదే అభిమానాన్ని చూపిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పాదయాత్రలో భట్టి ప్రజలతో మాట్లేడటప్పుడు, నిద్రపోయేటప్పుడు, స్నానం, హెల్త్ చెకప్ టైమ్ లో తీసిన ఫోటోలను..వైఎస్ఆర్ పాదయాత్రలో తీసిన ఫొటోలతో జత చేస్తున్నారు. నాడు రాజన్న.. నేడు భట్టి అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు భట్టి అనుచరులు. వైఎస్, భట్టి ఫోటోలను పక్కపక్కన పెట్టి తిప్పుతున్నారు.

పాదయాత్రలో.. మే 18, 2003లో వైఎస్ అస్వస్థకు గురయ్యారు. పాదయాత్ర శిబిరంలోనే డాక్టర్లు ఆయనకు ట్రీట్ మెంట్ ఇచ్చారు. భట్టి కూడా తన పాదయాత్రలో అనారోగ్యానికి గురైయ్యారు. మే 18, 2023 రోజునే డాక్టర్లు ఆయనకు చికిత్స చేశారు. అప్పటి వైఎస్ఆర్ ఫోటోకు.. భట్టి ట్రీట్ మెంట్ ఫోటో జత చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆయన అనుచరులు. 

సీఎల్పీ లీడర్ గా YS రాజశేఖర్ రెడ్డి..ప్రజా ప్రస్థానం పేరుతో 2003లో పాదయాత్ర చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎల్పీ హోదాలో భట్టి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుందని భట్టి సెంటిమెంట్ గా ఫీలవుతున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారట భట్టి.