సీఎం రేవంత్ అధ్యక్షతన CLP భేటీ.. కీలక అంశాలపై డిస్కస్

సీఎం రేవంత్ అధ్యక్షతన CLP భేటీ.. కీలక అంశాలపై డిస్కస్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు (సెప్టెంబర్ 22) కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. హైదరాబాద్‎లోని ట్రైడెంట్ హోటల్ వేదికగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ భేటీకి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత మొదటిసారి జరగనున్న ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వానికి మధ్య కో ఆర్డినేషన్‎పై డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే, త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపైన ఈ భేటీలో చర్చించనున్నట్లు టాక్. 

ALSO READ | టార్గెట్ లోకల్ బాడీ..రంగంలోకి పీసీసీ చీఫ్ మహేష్

కాగా, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం ముగియడంతో మరో సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్‎ను ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్‎గా ఈ నెల 15న మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే సీఎల్పీ భేటీకి పిలుపునిచ్చిన కాంగ్రెస్.. స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.