
సంగారెడ్డి టౌన్ , వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం సంగారెడ్డి లోని జిల్లా పార్టీ కార్యాలయంలో మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే బస్సుయాత్రపై చర్చించారు.
సమావేశంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి లక్ష్మీ నరసయ్య, శ్రీనివాస్ నాయుడు, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మురళీధర్ గౌడ్, దిలీప్ నాయక్, అనంతరావు, మాణికరావు, ముత్తిరెడ్డి, నరసింహారెడ్డి, మల్లికార్జున్ పాటిల్ పాల్గొన్నారు.