తక్కువ వడ్డీకి రుణాలివ్వండి.. నాబార్డు చైర్మన్కు సీఎం విజ్ఞప్తి

తక్కువ వడ్డీకి రుణాలివ్వండి.. నాబార్డు చైర్మన్కు సీఎం విజ్ఞప్తి
  • మైక్రో ఇరిగేషన్​ కు నిధులు సైతం
  • కొత్త జిల్లాల్లో డీసీసీబీలు ఏర్పాటు చేయాలన్న నాబార్డ్ చైర్మన్​

హైదరాబాద్​: సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ ఇవాళ సమావేశం అయ్యారు. ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ ను సీఎం ఈ సందర్భంగా కోరారు. మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలన్నారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు, కొత్తగా మరిన్ని సొసైటీలను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరారు. 

ALSO READ | తాగునీటి సమస్య రానివ్వం.. తప్పుడు ప్రచారం మానుకోవాలె.. బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క సీరియస్

నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలన్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబార్డ్ ఛైర్మన్ షాజీ కేవీ ప్రతిపాదించారు.