రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ను ప్రారంభించారు. సికింద్రాబాద్ లో వెస్ట్ మారేడ్ పల్లిలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి రోజూ 20 లక్షల మంది1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు.
బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ మెనూ ఇదే..
సోమవారం: ఇడ్లీ సాంబార్ లేదాగోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం: పూరి, ఆలూ కుర్మా లేదా రవ్వతో చేసిన టమాటా బాత్, చట్నీ
బుధవారం-: ఉప్మా, సాంబార్ లేదాకిచిడీ, చట్నీ
గురువారం: మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం: ఉగ్గాని/పోహా, మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం-: పొంగల్, సాంబార్ లేదా వెజ్ పులావ్, రైతా/ఆలూ కుర్మా
ప్రైమరీ, యూపీఎస్, హైస్కూల్ టైమింగ్స్..
ట్విన్ సిటీస్: ఉదయం 8 గంటల నుంచి
ఇతర జిల్లాల్లో: ఉ. 8:45 గంటల నుంచి