హైదరాబాద్‌ తరహాలో అమరావతి పునఃనిర్మాణం: సీఎం చంద్రబాబు

 ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు  ఈ రోజు ( జూన్​ 13) తిరుమల వేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  అనంతరం  శ్రీ గాయత్రి నిలయం.. విశ్రాంతి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ తరహాలో అమరావతి పునః నిర్మాణం జరగాలన్నారు..  2047 నాటికి దేశంలో తెలుగు వారిని నెంబర్​ వన్​ స్ఠానంలో నిలిపేందుకు తనకు శక్తిని ఇవ్వాలని శ్రీవేంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు తెలిపారు.  దేశం, రాష్ట్రంలోని ప్రజలందరిని  సిరిసంపదలతో .. ఆనందంగా ఉండాని... ఆంధ్రప్రదేశ్​ ను పేద రహిత రాష్ట్రంగా మార్చేందేకు శక్తిని ప్రసాదించాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. 

తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని.. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని.. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దన్నారు. తనకు నిత్యం శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణతోనే దినచర్య ప్రారంభమవుతుందన్నారు,  తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ.. చదువుకునే రోజుల్లో శ్రీనివాసమంగాపురం, తిరుపతికి నడిచి వెళ్లే సమయంలో తిరుమల శ్రీవారిని స్మరించుకున్నానన్నారు.  శ్రీ వేంకటేశ్వర స్వామి తన కులదైవమంటూ.. 2003లో అలిపిరిలో జరిగిన క్లైమోర్ మైన్స్ దాడి నుంచి ఆ వేంకటేశ్వరస్వామి కాపాడారని.. తనను ప్రాణాలతో బయటపడేశారన్నారు. ఆ దేవుడి ఆశీస్సులతోనే రాష్ట్రానికి మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు.