మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ లో సందడి చేసిన సీఎం, డిప్యూటీ సీఎం...

మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ లో సందడి చేసిన సీఎం, డిప్యూటీ సీఎం...

ఏపీలో మెగా పేరెంట్స్ - టీచర్స్ సమావేశాలను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. శనివారం ( డిసెంబర్ 7, 2024 ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో ప్రారంభించింది ప్రభుత్వం. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన చంద్రబాబు పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ లను పరిశీలించటం ఆసక్తి సంతరించుకుంది.

ALSO READ : చంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు: అంబటి రాంబాబు

కడప జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ లో పాల్గొని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాయలసీమలో అత్యధికంగా గ్రంధాలయాలు ఉన్నాయని.. అందుకే తాను రాయలసీమను ఎంచుకున్నానని అన్నారు.రాయలసీమ అన్నమయ్య, మొల్ల, పుట్టపర్తి నారాయణాచార్యులు, వంటి ఎందరో మహానుభావులు పుట్టిన నేల అని, రాయలసీమ ప్రాంతం సాహిత్యానికి నిలయమని అన్నారు పవన్ కళ్యాణ్.