సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు.. ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును బట్టి ఈ ర్యాంకులు డిసైడ్ చేశారు. గురువారం ( ఫిబ్రవరి 6, 2025 ) జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రుల ర్యాంకులు ప్రకటించిన చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో పనితీరు బాగాలేని పలువురు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. అయితే.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లలో ఒక్కరు కూడా టాప్ 5లో లేకపోవడం ఇక్కడ గమనార్హం.
ఈ ర్యాంకుల జాబితాలో సీఎం చంద్రబాబు 6వ స్థానంలో నిలవగా.. మంత్రి లోకేష్ 8వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ 10వ స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఎన్ఎండీ ఫరూఖ్ ఉండగా.. మిగతా మంత్రులు వరుసగా.. కందుల దుర్గేష్ 2వ స్థానం కొండపల్లి శ్రీనివాస్ 3వ స్థానం, నాదెండ్ల మనోహర్ 4వ స్థానం డోలా బాల వీరాంజనేయులు 5వ స్థానం, సీఎం చంద్రబాబు 6వ స్థానం, సత్యకుమార్ 7వ స్థానం, లోకేష్ 8వ స్థానం, బీసీ జనార్థన్ రెడ్డి 9వ స్థానం, పవన్ కల్యాణ్ 10వ స్థానంలో ఉన్నారు.
ALSO READ | చంద్రబాబు గుడ్ న్యూస్ : తల్లికి 15 వేలు, రైతుకు డబ్బులు విధివిధానాలపై కసరత్తు
సవిత 11, కొల్లు రవీంద్ర 12, గొట్టిపాటి రవికుమార్ 13, నారాయణ 14, టీజీ భరత్ 15, ఆనం రాంనారాయణరెడ్డి 16, అచ్చెన్నాయుడు 17, రాంప్రసాద్ రెడ్డి 18, గుమ్మడి సంధ్యారాణి 19, వంగలపూడి అనిత 20, అనగాని సత్యప్రసాద్ 21, నిమ్మల రామానాయుడు 22, కొలుసు పార్థసారధి 23, పయ్యావుల కేశవ్ 24, చివరి 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్ నిలిచారు.తక్కువ ఫైల్స్ ఉండే వాళ్లు కూడా క్లియరెన్స్‌లో వెనుకబడి ఉంటే ఎలా.. అంటూ వెనుకబడిన మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.