2024 ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు సీఎంగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఎన్డీయే కూటమి. ఈ సందర్బంగా మాట్లాడిన చంద్రబాబు ఏపీ రాజధానిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి మన రాజధాని అని అన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కర్నూలును కూడా అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు చంద్రబాబు.
ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజావేదికలా కూల్చివేతలు ఉండబోవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లాగా మూడు రాజధానులు అంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలు ఉండవని అన్నారు.విశాఖలో కూటమికి సునామీలా మెజారిటీ వచ్చిందని, నువ్వు రావద్దని జగన్ కు విశాఖ ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. రాయలసీమలో కూడా కూటమికి ఊహించని మెజారిటీ వచ్చిందని, రాయలసీమ ప్రజలు జగన్ పై తిరుగుబాటు చేసారని అన్నారు.