
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో లా అండ్ ఆర్దర్ గురించి మాట్లాడిన సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలను మోసగిస్తే తాట తీస్తామని అన్నారు చంద్రబాబు. కొందరు ఆడబిడ్డలను మాయమాటలతో మోసగిస్తున్నారని.. వారి అంతు చూస్తామని హెచ్చరించారు చంద్రబాబు. ఆకతాయిలు వేధిస్తుంటే శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని.. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారని అన్నారు చంద్రబాబు.
వైసీపీ తీసుకొచ్చిన దిశా యాప్ దిశా యాప్ దిక్కుమాలిన యాప్ అని మండిపడ్డారు చంద్రబాబు. హత్యా రాజకీయాల మారక లేకుండా 42ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు. నేరాలు, ఘోరాలు చేసి రాజకీయాలు చేస్తామంటే కుదరదని అన్నారు చంద్రబాబు.
సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని.. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో ఇప్పుడు బూతులు లేవని.. చర్చలు జరుగుతున్నాయని అన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో రౌడీయిజం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. భూకబ్జాలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టం తెస్తున్నామని అన్నారు. డ్రోన్ పెట్రోలింగ్, సీసీ కెమెరాలు తెస్తున్నామని.. సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేస్తామని అన్నారు.