తెలుగు యువతను అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేస్తా: సీఎం చంద్రబాబు

తెలుగు యువతను అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేస్తా: సీఎం చంద్రబాబు

దావోస్ పర్యటన నుండి తిరిగొచ్చిన సీఎం చంద్రబాబు పెట్టుబడుల అంశంపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం అడగడం కాదు..ఉద్యోగం ఇచ్చే స్థాయికి యువత ఎదగాలని... తెలుగు యువతను అసాధారణ వ్యక్తులుగా తయారు చేసే ప్రయత్నంలో ఉన్నానని అన్నారు. ప్రస్తుతం 100 దేశాల్లో తెలుగు వాళ్లు ఉన్నారని... రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో మన వాళ్లు ఉంటారని అన్నారు.

అమెరికాలో 12వ భాషగా తెలుగు ఉందని... సాధారణమైన వ్యక్తుల్ని అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నానని... అది జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతామని అన్నారు. అమెరికన్ల తలసరి ఆదాయం 60 వేల డాలర్లుగా ఉంటే... అమెరికాలోని తెలుగువారి తలసరి ఆదాయం లక్షా 20 వేల డాలర్లుగా ఉందని అన్నారు చంద్రబాబు.