ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై అసెంబ్లీలో ప్రసంగించిన చంద్రబాబు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తున్నామని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది భయంకరమైన చట్టమని అన్నారు.ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి లాక్కునే పరిస్థితి వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం ఆలోచన లేకుండా ఈ చట్టాన్ని తెచ్చిందని అన్నారు. భూ సమగ్ర సర్వేపై వివాదాలున్నాయని, అందుకే హోల్డ్ చేశామని వివరించారు చంద్రబాబు.
Also Read:-ఏపీలో రెడ్ బుక్ కిరాతక పాలన చూడండీ : ఢిల్లీలో జగన్ ఎగ్జిబిషన్
భూమి పాస్ పుస్తకాలపై అప్పట్లో సీఎం బొమ్మ వేసి ఇచ్చారని, ఆ పాస్ పుస్తకాలు మార్చి రాజముద్ర వేసి ఇస్తామని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల పౌరుల భూమి లాక్కునే పరిస్థితి వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల ఎవ్వరైనా ఈ భూమి నాది అంటే, అది ట్రిబ్యునల్ కి వెళ్తుందని,అలా ప్రైవేట్ భూములను లాక్కునే అవకాశం ఉందని అన్నారు చంద్రబాబు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి 512జీవోను రహస్యంగా ఉంచారని, తాము అధికారంలోకి వస్తే ఈ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని అన్నారు చంద్రబాబు. ఈ నల్ల చట్టం ద్వారా విదేశాల్లో ఉండేవారి భూమికి ప్రమాదం ఉందని, సభ్యులంతా కలిసి ఈ నల్ల చట్టానికి మంగళం పడాలని కోరుతున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. బుధవారం ( జూలై 24, 2024 ) నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.