
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. ఎలాంటి గందరగోళం లేకుండా మెగా డీఎస్సీ నియామకాలు జరిగేలా చేస్తామని అన్నారు. జూన్ లో స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు చంద్రబాబు. కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఈమేరకు వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో రెవెన్యూ, భూసమస్యలపై చర్చించిన చంద్రబాబు.. భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలకు సంబంధించి పురోగతి, లక్ష్యాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు.ప్రజలకు ఆమోదయోగ్యంగా అధికారులు పనిచేయాలని.. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం సరికాదని అన్నారు.
Also Raed : ఇంటర్ చదివి ఖాళీగా ఉన్నారా.. మీకే ఈ గోల్డెన్ ఛాన్స్.. వెంటనే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. ఏసీ రూముల్లో కూర్చొని బయటికి రాకుండా పనిచేయాలంటే కుదరదని అన్నారు.
ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందని..కొందరు అభివృద్ధి చేస్తే.. మరికొందరు నాశనం చేస్తారని అన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీఇచ్చామని.. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ ప్రభుత్వ విధానమని అన్నారు చంద్రబాబు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని.. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని అన్నారు చంద్రబాబు.