దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను తిరిగి తీసుకొస్తాం .. సీఎం చంద్రబాబు 

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. గత ఐదేళ్లలో దెబ్బ తిన్న ఏపీ బ్రాండ్ ను తిరిగి తెచ్చే దిశగా సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వే చ్ఛను అందించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు చంద్రబాబు. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పాలనకు శ్రీకారం చుట్టామని అన్నారు చంద్రబాబు .

100 రోజుల ప్రణాళిక టార్గెట్గా అన్ని శాఖల్లో సమీక్షలు చేపట్టామని, గత ప్రభుత్వం నిర్వీ ర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నామని అన్నారు. 1857 కంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్ర చెబుతోందని, ఇది చైతన్యం కలిగిన ప్రాంతమని అన్నారు. విభజనతో ఏర్ప డిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన మొదలుపెట్టామని, అటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వా న్ని పట్టాలెక్కించామని అన్నారు . అనుభవం, ప్రజల మద్దతు, సహకారాలతో కొద్ది కాలం లోనే నిలదొక్కుకున్నామని అన్నారు చంద్రబాబు.