ప్రధాని మోడీతో అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీకి కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం ప్రకారం రావాల్సినవే ఏపీకి వచ్చాయని, ఏదో ప్రత్యేకంగా ఇచ్చినట్లు కొంతమంది రాజకీయం చేస్తున్నారని అన్నారు. గత ఐదేళ్ళలో రాష్ట్రం విభజన కంటే ఎక్కువ నష్టపోయిందని, పరిస్థితి అద్వాన్న స్థాయికి దిగజారిందని అన్నారు. తలసరి ఆదాయం పడిపోయిందని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రానికి కావాల్సిన అంశాలను ప్రతిపాదించామని,ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే కేంద్రం ఇచ్చిందని అన్నారు. అమరావతి,పోలవరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వంటి అన్ని అంశాలు విభజన చట్టంలో ఉన్నాయని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ప్రత్యేక హోదా బదులు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి సహాయం చేస్తామన్న విషయాన్నీ గుర్తుచేశారు చంద్రబాబు. విభజన సమయంలో ఏపీ తెలంగాణకు తలసరి ఆదాయంలో 30 వేల రూపాయలు తేడా ఉందని అన్నారు చంద్రబాబు.