అదానీతో జగన్ ఒప్పందం ఏపీకి చాలా లాభం: సీఎం చంద్రబాబు

అదానీతో జగన్ ఒప్పందం ఏపీకి చాలా లాభం: సీఎం చంద్రబాబు

ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీకి చెంది అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాలో అవినీతి ఆరోపణలు రావడం ఏపీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అదానీ స్కాంలో మాజీ సీఎం జగన్ ప్రమేయం ఉందంటూ అధికార కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అదానీతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కూటమి నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే... అదానీతో జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఏపీకి చాలా లాభమని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఆదానీతో గత ప్రభుత్వం చాలా తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుందని.. దీని వల్ల ఏపీకి చాలా లాభమని సీఎం చంద్రబాబు అన్నారు. అదానీపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని అన్నారు. ఈమేరకు జాతీయ మీడియాలో వచ్చిన కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ | కేంద్ర ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తుకు రాష్ట్రాల అనుమతి అక్కర్లే

ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు జగన్ పై దుష్ప్రచారం చేశారని.. జాతీయ మీడియాలో వచ్చిన కథనాలే ఇందుకు నిదర్శనం వైసీపీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.