విభజన కంటే జగన్ వల్లే ఏపీకి తీరని నష్టం...సీఎం చంద్రబాబు

ఏపీకి నాలుగవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిసారి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. శనివారం ( జూలై 6, 2024 ) నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి విభజన సమస్యలపై చర్చించిన చంద్రబాబు ఆదివారం ( జులై 7, 2024 )నాడు తెలంగాణ టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఏపీ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలనలోనే ఏపీకి తీరని నష్టం వాటిల్లిందని అన్నారు.

తనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలు ముందుకొచ్చి మద్దతిచ్చిన తీరు ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు చంద్రబాబు. తెలుగుజాతి తనకు ఎంతో ఇచ్చిందని, మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డ మీదనే పుట్టాలని దేవుడిని కోరుకుంటున్నానని  అన్నారు చంద్రబాబు. తెలంగాణ టీడీపీకి యువ రక్తాన్ని ఎక్కిస్తామని, పునర్వైభవాన్ని తెస్తానని అన్నారు చంద్రబాబు.