![జగన్ నాటకాలపై అప్రమత్తంగా ఉండండి: మంత్రులతో సీఎం చంద్రబాబు](https://static.v6velugu.com/uploads/2025/02/cm-chandrababu-comments-on-ys-jagan-over-tirumala-laddu-row_KXvlJEicCI.jpg)
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ అరెస్టుల అంశం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. ఈ అంశంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది.ఈ క్రమంలో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.తాను చెప్పింది నిజం అని నమ్మించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని.. జగన్ నాటకాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్నారని అంటే.. జగన్ గతంలో తప్పుబట్టారని.. అప్పట్లో తాను చెప్పింది నిజమేనని ఇప్పుడు సీబీఐ అరెస్టుల ద్వారా నిరూపితం అయ్యిందని అన్నారు సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసులో సీబీఐ అరెస్టులు సహా పలు అంశాలపై మంత్రులతో చర్చించిన చంద్రబాబు... ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ALSO READ | ఏపీ కుల సర్టిఫికెట్లు తెలంగాణలో చెల్లవా.? హైకోర్ట్ ఏం చెప్పింది
శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వాడే నెయ్యికి సంబంధించి వైసీపీ హయాంలోనే టెండర్లకు పిలిచారని.. అంతే కాకుండా కొందరికి అనుకూలంగా నిబంధనలు కూడా మార్చారని అన్నారు చంద్రబాబు. నెయ్యి కల్తీ అంశం బయటపడ్డాక కూడా నెయ్యి సరఫరాలో అక్రమాలు లేవంటూ మాట్లాడటమే కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు.