వైసీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ పని చేయొద్దు: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ పని చేయొద్దు: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పెన్షన్ పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీకి డైరెక్ట్ గా కానీ, ఇండైరెక్ట్ గా కానీ ఏ పని చేయకూడదని కార్యకర్తలకు ఆదేశించారు. ఎన్నికల తరువాత, పార్టీ కష్టపడ్డ  కార్యకర్తలతో కూర్చుని మాట్లాడుకోలేక పోయానని... పార్టీ కార్యకర్తలతో మాట్లాడి 9 నెలలు అయ్యిందని అన్నారు. అందుకే ఇప్పుడు కార్యకర్తలను కలవటానికి వచ్చానని... రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ రాదని మతిస్తున్నానని అన్నారు సీఎం చంద్రబాబు.

నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరిగితేనే ప్రజల కష్టాలు తెలుస్తాయని.. ఏసీ గదుల్లో కూర్చుంటే తెలియవని అన్నారు. అందుకే పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని అధికారులకు, నాయకులకు చెప్పానని అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు రావాలన్నదే తన కోరిక అని... గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు చంద్రబాబు. 

గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించి ప్రజలు మంచి పని చేశారని... ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రానికి సంజీవనిగా మారిందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని.. ఇప్పుడు అప్పు అడిగినా ఎవరూ ఇవ్వడంలేదని అన్నారు చంద్రబాబు.