చంద్రబాబు గుడ్ న్యూస్ : తల్లికి 15 వేలు, రైతుకు డబ్బులు విధివిధానాలపై కసరత్తు

చంద్రబాబు గుడ్ న్యూస్ : తల్లికి 15 వేలు, రైతుకు డబ్బులు విధివిధానాలపై కసరత్తు

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు.. సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలకు ఇంతటితో ఎదురుచూపులు ఫుల్ స్టాప్ పడినట్లే అని చెప్పాలి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి కీలక పథకాలు వీలైనంత త్వరగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. వచ్చే మూడు నెలల పాటు జనంలోకి వెళ్లాలని.. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలని అన్నారు.

వచ్చే విద్యాసంవత్సరం నుండి తల్లికి వందనం ప్రారంభిస్తున్నామని.. ఏప్రిల్ లో మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలని అన్నారు. లిక్కర్ షాపుల మార్జిన్ 10.5శాతం నుండి 14శాతానికి పెంచాలని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయట్లేదంటూ ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలకు చెక్ చెప్పే దిశగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.