టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న  నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.  పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పని చేయాలని కోరారు. 

అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జల్‌జీవన్‌ కృషి సించాయీ యోజక కింద రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపుపై చర్చ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. విభజన హామీల పరిష్కారానికి కృషి చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. కేంద్రంతో సమన్వయం చేసుకునేలా ఒక్కో ఎంపీకి ఒక్కో శాఖ కేటాయించామన్నారు.